Daily Horoscope
✕

త‌ప్పులు ఎంచే మనుషులు తమ తప్పులను తెలుసుకొనలేరు

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 18 జూన్ 2021 (21:37 IST)
ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచులు జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ, వినుర వేమా
 
అర్థం: ఉప్పు, కర్పూరం చూచుటకు ఒకే మాదిరి కనపడతాయి కానీ వాటి రుచులు వేరుగా ఉంటాయి. చూడటానికి అందరూ మనుషులొక్కమాదిరి గా కనిపించినా, పుణ్య పురుషులు అంటే సత్పురుషులు వేరుగా ఉంటారు. వారిని గుర్తించగలగాలి. అదే విజ్ఞత.
 
2. 
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభి రామ వినురవేమ!
 
అర్థం:  
పాడగా పాడగా పాట మధురంగా నుండును. చేదుగా ఉండే వేప కూడా తినగా తినగా తీపిగా ఉండును. అట్లే ఈ భూమిపై  ప్రయత్నంతో ఎటువంటి పనులనైనా సాధించగలం.
 
3. 
తప్పులెన్ను వారు తండోపతండంబు
ఉర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్ను వారు తమ తప్పులెరుగరు
విశ్వదాభి రామ వినురవేమ
 
అర్థం:
ఈ ప్రపంచంలో ఇతరుల తప్పులను ఎత్తి చూపేవారు కోకొల్లలు. జనులందరిలో ఏదో ఒక తప్పు ఉండనే ఉంటుంది. ఇత‌రుల్లో త‌ప్పులు ఎంచే ఈ మనుషులు తమ తప్పులను తెలుసుకొనలేరు. తప్పులను చెయ్యటం మానవ సహజం.

అన్నీ చూడండి

Kadapa: కారుకు నిప్పు పెట్టిన ఘటన.. నలుగురు అరెస్ట్

తిరుపతి జెడ్పీ చైర్‌పర్సన్ పోస్ట్: యువ వైద్యుడు వర్సెస్ ఎమ్మెల్యే

కోత కాలంలో రైతుల కష్టాలు: అర్నాబ్‌తో 5.36 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం

కారులో అగ్నిప్రమాదం.. కారు డ్రైవర్ బయటికి దూకేశాడు..

తుఫాను బాధిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన

అన్నీ చూడండి

Aadarsha Kutumbam Movie Review: సరదాగా సాగే ఆదర్శ కుటుంబం ..రివ్యూ

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌ 10.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్?

విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం - మద్యం మత్తులో సెల్ఫీ కోసం యత్నం...

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన జియో హాట్‌స్టార్‌

S.S. Rajamouli: భావోద్వేగ ప్రధానాంశంతో కథలను ఎలా చెప్పాలో వివరించిన ఎస్.ఎస్. రాజమౌళి

తర్వాతి కథనం
Show comments