గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కవితలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 7 అక్టోబరు 2020 (15:20 IST)

నీళ్లు పోయిన తర్వాత చేప బ్రతుకు లాంటిదని తెలుసుకోలేకపోతున్నాడు, అలాంటి వారికి గతిలేదు

పరగ ముందరి తమ బ్రతుకు తెర్వెరుగక
సకల సంపదలును సతము లనుచు
జలము బాయు చేప చంద మేర్పడి తుద
గతియు వేరె లేక కలుగు వేమ!!
 
తమ జీవన గమనం ఎలా వుంటుందో తెలుసుకోలేక తనకు గల సిరి సంపదలు అలాగే శాశ్వతాలు అని ఎంచుతాడు మనుజుడు. నీళ్లు పోయిన తర్వాత చేప బ్రతుకు లాంటిదని తెలుసుకోలేకపోతున్నాడు. అలాంటి వారికి గతిలేదు.
 
2. 
రూపు పేరు రెండు రూఢితో గలిగిన
పేరు రూపు క్రియను పెనసి యుండు
నామ రూపములును నాశ మొందుట మేలు
విశ్వదాభిరామ వినుర వేమ
 
- రూపంతో పేరు ఏర్పడుతుంది. పేరు రూపానికి ఏర్పడుతుంది. రూపం పేరూ, పేరూ రూపం అనేవి అన్యోన్యాశ్రయం అయి వున్నాయి. ఇటు రూపం కానీ అటు పేరు కానీ రెండూ మిథ్యయే. కాబట్టి ఈ రెండూ నాశనం అవడమే మంచిది. అదే ముక్తి.