గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కవితలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 5 అక్టోబరు 2020 (19:57 IST)

అసలే దరిద్రుడు, వడ్డీకి ఆశపడి అప్పు ఇస్తే...

కానివాని చేత కాసు వీనము లిచ్చి
వెంట దిరుగుటెల్ల వెర్రితనము
పిల్లిబట్టకోడి పిలిచిన పలుకునా
విశ్వదాభిరామ వినుర వేమ
 
దరిద్రుడికి ఉన్న కాస్తా అప్పు యిచ్చి దాన్ని రాబట్టుకోవడానికి వాణ్ణి వెంబడించడం వెర్రితనం కాదా? అది ఎలాంటిది అంటే, పిల్లిని పట్టుకోవడానికి కోడిని బోబో అని పిలిచినట్లు. అంతా వ్యర్థ ప్రయాస
 
2. 
పూర్వ జన్మమందు సేయని
పాపి ధనము కాశపడుట యెల్ల
విత్తు మరచి గోయ వెదకిన చందంబు
విశ్వదాభిరామ వినుర వేమ
 
- గత జన్మలో పుణ్యం చేయని పాపాత్ముడు ఈ జన్మలో ధనం కోసం ఆశపడటం ఎలా వుంటుందంటే.. చేనులో విత్తులే నాటకుండా చేను కోయడం కోసం వెళ్తున్నట్లుంటుంది.