శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (19:55 IST)

అతనో పాన్‌బ్రోకర్, అప్పు కోసం అందమైన యువతులు వచ్చారో, అంతేసంగతులు

అతనో పాన్ బ్రోకర్. అమ్మాయిలకు వలవేయడం, వారిని అనుభవించడం, అలాగే దొంగ లెటర్ ప్యాడ్‌లతో గదులు అద్దెకు తీసుకోవడం, వివిధ ప్రాంతాల్లో జల్సాగా తిరగడం అలవాటుగా మార్చుకున్న వ్యక్తి చివరకి పోలీసులకు అడ్డంగా దొరికి కటాకటాల పాలయ్యాడు.
 
బ్రాండెడ్ దుస్తులు, రిచ్ మెయింటైనెన్స్, అవసరమని ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే సహాయం చేసేంత డబ్బు. ఇంకేముంది ఎవరైనా పడిపోవాల్సిందే. ఇలా ఏడుగురు అమ్మాయిలతో ఆడుకున్నాడు మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాకు చెందిన మొహ్మద్ లతీఖ్. 
 
చేసేది సాధారణ కుదువ వ్యాపారం. కానీ అమ్మాయిలకు వల వేయడంలో అందె వేసిన చేయి. ఒకటిన్నర సంవత్సరంలో ఏడుగురు యువతలకు బాగా దగ్గరయ్యాడు. వారిని శారీరకంగా అనుభవించాడు. వారితో గడిపిన క్షణాలను వీడియోలుగా చిత్రీకరించాడు.
 
ఎవరైనా గట్టిగా మాట్లాడితే మాత్రం ఆ వీడియోలు చూపించి భయపెడతాడు. అయితే ఈ ఏడుగురిలో ఒకరిని పెళ్ళి చేసుకున్న మూడు నెలలకే వదిలేశాడు. ఇతని బాగోతాన్ని బయట పెట్టింది 16 యేళ్ళ యువతి. సంవత్సరంగా ఇతని చేతిలో నలిగిపోతూ తన ఆవేదనను పోలీసులకు వివరించింది.
 
కష్టాల్లో ఉన్న తను ఇంట్లో ఉన్న నగలను కుదవపెట్టేందుకు వెళితే తనకు డబ్బు సాయం చేయడంతో పాటు తన కుటుంబ సభ్యులకు దగ్గర లతీఖ్ దగ్గరయ్యాడు. అందుకే నాకు అతను బాగా నచ్చాడు. అతన్ని నమ్మి సర్వస్వం అప్పజెప్పాను.
 
కానీ అతని నిజస్వరూపం వారం రోజుల క్రితమే బయటపడింది. తన స్నేహితులతో వెళ్ళమని నన్ను ఇబ్బంది పెట్టేవాడు. పెళ్ళి చేసుకోమంటే అలాంటివి అడగవద్దంటూ నేను అతనితో కలిసి ఉన్న వీడియోలను చూపించాడు. షాకయ్యాను. ఇతడినా నేను నమ్మిందని బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేసింది యువతి. 
 
దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట్లో ఆ యువతి ఫిర్యాదుతో అరెస్టు చేస్తే ఆ తరువాత విచారణలో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. 16 యేళ్ళ యువతితో పాటు మరో ఏడుగురు జీవితాలను అతను నాశనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.