మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కవితలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (22:27 IST)

ఏదీ స్వాతంత్ర్యం! : ఏమిటీ దుస్థితి.. ఎంతకాలమీపరిస్థితి...

కారు వేగంగా వచ్చి ఆగింది
కూలీలు గుమి గూడి వున్నారక్కడ పనికోసం
రేయ్ పోలిగా యాభై మందిని తీసుకొని రా పనికి
మీ యీ అధికారం, అహంకారం ఇంకా ఎన్నాళ్ళండీ
మిమ్మల్నే నమ్మి వచ్చే ఈ జనాల్ని
ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారు
 ఇవ్వరు వాళ్ళకు కూలీ సరిగ్గా
ఆడంబర జీవితాలూ
మిద్దెలూ మేడలే మీకు కనిపిస్తాయా
కనీస వసతులు లేక 
ఉండేందుకు గట్టి ఇల్లు లేక
చాలీ చాలని రాబడితో బ్రతక లేక
బ్రతికే ఈ నిర్భాగ్యులు కనబడరా మీకు
వారూ మనుషులేనని గుర్తించరా
పొందాము స్వాతంత్ర్యం పరాయి పాలకుల నుండి
డెభ్భై నాలుగేళ్లైనా పొందలేక పోతున్నాము మీ నుండి స్వాతంత్ర్యం
ఏమిటీ దుస్ధితి, ఇంకా ఎంత కాలమీ పరిస్థితి
పేదల కడుపులు మాడినపుడు
వారి బాధలు అగ్నికణాలై ఎగసినపుడు
అవి మిమ్ముల చుట్టు ముట్టినపుడు
మాడి మసై పోతారు మీరు
కాబట్టి ఇకనైనా మారండి
ప్రయత్నించండి మారేందుకు...

---- గుడిమెట్ల చెన్నయ్య