శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 6 ఏప్రియల్ 2019 (15:31 IST)

నాగ‌బాబు కోసం బ‌న్నీ ఏం చేసాడో తెలుసా..?

నరసాపురం నుంచి జనసేన అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేస్తున్న నాగబాబుకు మెగా హీరో అల్లు అర్జున్ మద్దుతు తెలిపారు. మేం మీతో ఉన్నాం అని ట్వీట్ చేసిన బన్నీ.. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా, ప్రోత్సహిస్తున్నా.. మేమంతా మీతో ఉన్నాం అనే సందేశాన్ని పంపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయం తీసుకున్న నాగబాబు గారికి హృదయ పూర్వక అభినందలు. 
 
రాజకీయ ప్రయాణంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఎన్నికల ప్రచారంలో ఫిజికల్‌గా మేం మీతో ఉండకపోవచ్చు. కానీ మానసికంగా మాత్రం ఎప్పుడూ మీతోనే ఉన్నాం. మా మద్దతు మీకు ఎప్పటికీ ఉంటుంది’ అని అల్లు అర్జున్ లేఖ ద్వారా తెలిపారు. 
 
పవన్ కళ్యాణ్‌కు, జనసేన పార్టీకి బన్నీ బెస్ట్ విషెస్ చెప్పారు. ‘తన నాయకత్వంతో, ముందు చూపుతో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తున్నాను. జనసేన రాజకీయ ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’నని ఆ లేఖలో అల్లు అర్జున్ పేర్కొన్నారు. 
 
అల్లు అర్జున్, వరుణ్ తేజ్ నర్సాపురంలో ప్రచారం చేస్తారని నాగబాబు సతీమణి పద్మజ ఇటీవలే ప్రకటించారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన వరుణ్ తేజ్ శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ తాను పాల్గొనడం లేదని అల్లు అర్జున్ ఈ లేఖ ద్వారా పరోక్షంగా వెల్లడించారని విశ్లేషకులు భావిస్తున్నారు. తాను ప్రచారంలో పాల్గొనకపోయినప్పటికీ.. తన మద్దతు, తన అభిమానుల మద్దతు నాగబాబుకు, జనసేనకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారని భావిస్తున్నారు.