పొట్ట నొప్పితో ఆస్పత్రికి వెళ్లింది.. ఆపరేషన్ చేస్తే.. కేజీన్నర బంగారం..
పొట్టనొప్పిగా వుందని ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు పరీక్షల తర్వాత ఆపరేషన్ చేయాలని వైద్యులు తేల్చేశారు. దీంతో ఆపరేషన్ చేసిన వైద్యులకు షాక్ తప్పలేదు. ఆమె కడుపులో ఏకంగా కేజీన్నరకు పైగా బంగారు నగలు వుండటంతో షాకయ్యారు. పశ్చిమబెంగాల్‌లో ఈ ఘటన సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా రామ్‌పురహాట్‌కు చెందిన ఓ మహిళ కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఏం జరిగిందో ఏంటోనన్న ఆందోళనతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆమె కడుపులో ఏదో లోహ పదార్థాలు ఉన్నాయని గుర్తించారు.
శస్త్రచికిత్స చేయడంకంటే మరో మార్గం లేదని స్పష్టం చేశారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ఆమె కడుపులో బంగారు నగలు ఉండడంతో షాక్ తిన్నారు. గొలుసులు, దుద్దులతోపాటు ఇనుప వస్తువులు కూడా ఉండడంతో షాకయ్యారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పగా.. ఇంతకీ ఆ లోహాలను ఆమె ఎందుకు మింగిందో తెలియట్లేదు.