1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (19:05 IST)

ఆరో తరగతి విద్యార్థినిపై ఇద్దరు టీచర్ల అత్యాచారం.. టాయిలెట్‌కు వెళ్లిన..?

rape
మహిళలపై వయోబేధం లేకుండా అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 7న బాలిక టాయిలెట్‌లో ఉండగా హెడ్మాస్టర్‌తోపాటు మరో ఉపాధ్యాయుడు బలవంతంగా గదిలోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
రెండ్రోజుల తర్వాత కడుపునొప్పిగా ఉందని బాలిక చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు బాలికపై లైంగికదాడి జరిగినట్టు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెడ్మాస్టర్‌తోపాటు మరో ఉపాధ్యాయుడిపై పోక్సో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.