బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (10:51 IST)

దేశంలో 13,091 కరోనా కొత్త కేసులు

దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 11,89,470 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,091 కొత్త కేసులు వెలుగుచూశాయి.

నిన్నటి కంటే 14శాతం మేర కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 340 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసులు 3.44 కోట్లకు చేరగా.. 4.6లక్షలకు పైగా మరణాలు నమోదయ్యాయని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
 
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు 1.4 లక్షల దిగువనే నమోదయ్యాయి. క్రియాశీల రేటు 0.40 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.25 శాతంగా కొనసాగుతోంది.

నిన్న 13,878 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.38 కోట్లను దాటాయి. ఇక నిన్న 57.54 లక్షల మంది కరోనా టీకా తీసుకొన్నారు. దీంతో దేశంలో మొత్తం 110 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.