ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గణతంత్ర వేడుకల సైనిక విన్యాసాలు

republic day
భారత 74వ గణతంత్ర వేడుకలు గురువారం దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన సైనిక విన్యాసాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ఈ సైనిక విన్యాసాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అతిరథ ఆహ్వానితులు, త్రివిధ దళాలు, బీఎస్ఎఫ్, వివిధ రెజెంట్లకు చెందిన సైనికులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సైనికులు ప్రదర్శించిన విన్యాసాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. డేర్ డెవిల్స్ బృందం మోటార్ సైకిళ్ళపై చేసిన సాహస ప్రదర్శనలు రోమాలు నిక్కపొడిచుకునేలా చేశాయి. ఇక బీఎస్ఎఫ్ మహిళ సైనికులు నిర్వహించిన ఒంటెలు పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 
 
ఇదిలావుంటే, గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లను 150 సీసీటీవీ కెమెరాలు, 6 వేల మంది సెక్యూరిటీ ఫోర్స్ మ‌ధ్య నిర్వ‌హించారు. రిప‌బ్లిక్ డే వేడుక‌ల నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా భ‌ద్రతా సిబ్బంది చ‌ర్య‌లు తీసుకుంది. ఢిల్లీలో సంఘ వ్య‌తిరేక శ‌క్తుల‌ను అరిక‌ట్టేందుకు పోలీసులు గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకున్నారు. ప్ర‌ధాన ప్రాంతాల్లో డ్రోన్ల‌పై నిషేధం విధించారు.