శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 26-01-2023 గురువారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా..

Raghavendra
మేషం :- విద్యార్థులకు ఉపాధ్యాయులు, సహచరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రముఖుల నుండి బహుమతులు స్వీకరిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నిర్మాణ పనులు, గృహ మరమ్మతులు చురుకుగా సాగుతాయి.
 
వృషభం :- భాగస్వాముల చర్చలలో కొన్ని అవరోధాలు తలెత్తుతాయి. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. తలపెట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతాయి. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు చదువుల్లో ఏకాగ్రత వహించిన రాణిస్తారు. ముఖ్యులలో ఒకరి వైఖరి మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
 
మిథునం :- ఉపాధ్యాయులకు అధికారుల నుండి పురస్కారాలు లభిస్తాయి. మీ పురోభివృద్ధి మీ చేతుల్లోనే ఉందని గమనించండి. మీ పొదుపరితనం కుటుంబసభ్యులకు చికాకు కలిగిస్తుంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. దంపతుల మధ్య చికాకులు తలెత్తుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు లభిస్తాయి.
 
కర్కాటకం :- పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ యత్నాలు అనుకూలిస్తాయి. తొందరపాటు నిర్ణయాలవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ యత్నాలు, పథకాలు గుట్టుగా సాగించండి. ధనసహాయం, ధనవ్యయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు లభిస్తాయి.
 
సింహం :- ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. కొంత మొత్తమైనా పొదుపు చేయాలన్న మీ కోరిక ఫలిస్తుంది. ముక్కుసూటిగా పోయే మీ స్వభావంవల్ల ఇబ్బందులెదుర్కుంటారు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తుంది.
 
కన్య :- స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాట పడక తప్పదు. బంధువుల రాకతో ఖర్చులు అధికం. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యం. భాగస్వామిక చర్చలు, ఉమ్మడి వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. చిన్నతరహా, కుటీర పరిశ్రమ వారికి ఆశాజనకం.
 
తుల :- ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చడం వల్ల మాటపడవలసి వస్తుంది. భార్య, భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. రుణం తీసుకోవటం, ఇవ్వటం క్షేమం కాదని గమనించండి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం :- స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు. పెద్ద మొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది. నూతన పెట్టుబడులు లీజు, ఏజెన్సీలకు మరికొంత కాలం ఆగటం మంచిది. మీ పనులు కార్యక్రమాల గురించి ఆందోళన చెందుతారు.
 
ధనస్సు :- ప్రచురణ, పత్రికారంగంలో వారికి మందకొడిగా వుండును. మీ కుటుంబీకులతో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. వాతావరణంలో మార్పువల్ల ఆరోగ్యం మందగిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాలపట్ల అవగాహన నెలకొంటాయి.
 
మకరం :- నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. అనుకున్నది సాధించడంతో ఉత్సాహంగా ఉంటారు. రాజకీయాలలో వారు తొందరపడి వాగ్ధానాలు చేయకండి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. స్త్రీలు ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది.
 
కుంభం :- గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది. బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. వైద్యులకు ఏకాగ్రత చాలా అసవరం. మీ శ్రీమతి, ఆత్మీయుల సలహ పాటించడం మంచిది. స్థిరాస్తి మూల ధనం చేతికందుతుంది. స్త్రీలకు అధికమైన శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యంలో చికాకులను ఎదుర్కొంటారు.
 
మీనం :- బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. మనుషుల మనస్తత్వం తెలిసి మసలు కొనుట మంచిది.ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి జారిపోవటంతో నిరుత్సాహానికి లోనవుతారు. ప్రింటింగ్ రంగాలవారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీకళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.