గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 25-01-2023 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన....

Astrology
మేషం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్ధులు కళాత్మక, క్రీడాపోటీలలో విజయం సాధిస్తారు. ఉన్నతస్థాయి వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. ఋణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు.
 
వృషభం :- పాత బాకీలు వసూలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది తొలగుతుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. బంధువుల కోసం మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. నిరుద్యోగుల కృషికి తగిన ప్రతిఫలం త్వరలోనే లభిస్తుంది.
 
మిథునం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు అధికం. స్త్రీలకు షాపింగులలోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులు తోటివారి నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు.
 
కర్కాటకం :- ఫ్యాన్సీ, కిళ్లి, కిరాణా రంగాలలో వారికి అనుకూలం. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు సదావకాశాలు లభించగలవు. ఖర్చులు అధికమవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ప్రత్యర్ధులు మీకు అనూహ్యంగా మీకు మద్దతు ఇస్తారు. మీలో ప్రతిభ వెలుగులోనికి వస్తుంది.
 
సింహం :- బ్యాంకు వ్యవహారాలలో చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. మీ సంతానం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది.
 
కన్య :- ఎంత ధనం వచ్చినా ఖర్చుకు సిద్దంగా ఉంటాయి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. ముఖ్యమైన పనులు మీరే చేసుకోవటం మంచిది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఉద్యోగస్తులకు పెండింగ్ పనుల పూర్తిలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కోర్టు వాజ్యాలు, కేసులు ఉపసంహరించుకుంటారు.
 
తుల :- నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవటం మంచిది. విద్యార్థులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. ఎల్.ఐ.సి. పోస్టల్, ఇతర ఏజెంట్లకు ఆశాజనకం. ఉద్యోగ యత్నాలు ఒక కొలిక్కి రావటంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహం కలిగిస్తాయి.
 
వృశ్చికం :- వృత్తుల వారికి ప్రముఖులతో సంబంధాలు మరింత బలపడతాయి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలు పనివారితో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ప్రైవేటు ఫైనాన్సు సంస్థలో పొదుపు చేయటం మంచిది కాదని గమనించండి. తలపెట్టిన పనులు హడావుడిగా పూర్తిచేస్తారు.
 
ధనస్సు :- స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించండి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహకారం, అధికారుల ప్రసంశలు పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులు ఎదుర్కోక తప్పదు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
మకరం :- ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు అయిష్టంగానే పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సోదరీ, సోదరులలో అవగాహన లోపం. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు.
 
కుంభం :- నూతన దంపతుల్లో ఉత్సాహం, కొత్త ఆలోచనలు చోటుచేసుకుంటాయి. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఒత్తిడి, పనిభారం అధికం. మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది.
 
మీనం :- బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ విషయాల పట్ల మీ వైఖరిలో మార్పు వస్తుంది. లాయర్లకు నిరుత్సాహం కానవస్తుంది. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉదోగస్తులకు పై అధికారులనుండి మాట పడవలసి వస్తుంది.