గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 23-01-2023 సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం...

Astrology
మేషం :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు మరికొంత సమయం పడుతుంది. ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. 
 
వృషభం :- ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. భార్యా, భర్తల మధ్య బంధం మరింతగా దృఢంగా మారుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. స్త్రీలకు సంతానంతో, పనివారలతో చికాకులు తప్పవు.
 
మిథునం :- ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. ధనం ఎంత వెచ్చించినా ఫలితం సామాన్యంగానే ఉంటుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి విమర్శలు తప్పవు. అకాల భోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
కర్కాటకం :- విద్యా రంగంలో వారికి నూతన ఉత్సాహం కానరాగలదు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.
 
సింహం :- ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారులకు సమస్య లెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం.
 
కన్య :- పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికిరాగలవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
తుల :- మీ అవసరాలకు కావలసిన ధనం ముందుగానే సర్దుబాటు చేసుకుంటారు. ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టం మ్మీద అనుకూలిస్తాయి. దంపతుల మధ్య తరుచు చిన్న చిన్న తగవులు, మాటపట్టింపులు చోటుచేసుకుంటాయి. మీ బలహీనతలను ఆసరా చేసుకుని కొంత మంది లబ్ధి పొందాలని చూస్తారు.
 
వృశ్చికం :- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దుబారా ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు, తోటివారి ప్రశంసలు లభిస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
ధనస్సు :- ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. రుణం ఏ కొంతైనా తీర్చటానికై చేయప్రయత్నం వాయిదా వేస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. విద్యార్థులకు అధిక శ్రమ వల్ల ఆరోగ్యంలో చికాకులు తప్పవు. కుటుంబ విషయలలో కూడ మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది.
 
మకరం :- అనుకున్న వ్యక్తుల కలయిక అనుకూలించక పోవటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగుల్లోనూ, వాహనం నడుపు తున్నప్పుడు ఏకాగ్రత అవసరం. ప్రతికా, వార్తా సంస్థలలోని వారికి ఏకాగ్రత చాలా అవసరం.
 
కుంభం :- తరుచుగా తెలియక చేసిన పొరపాట్లకు పశ్చాతాపపడతారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన, నిరుత్సాహం కలిగిస్తాయి. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
మీనం :- ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. తరుచూగా తెలియక చేసిన పొరపాట్లకు పశ్చాతాపపడతారు. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. రసాయినిక సుగంధ ద్రవ్య వ్యాపారులకు చికాకులు తప్పవు.