సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 21-01-2023 శనివారం దినఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో...

astro5
మేషం :- సమయానుకూలంగా మీరు తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తుంది. అంతగా పరిచయంలేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, కార్మికులతో చికాకులు తప్పవు.
 
వృషభం :- ఉద్యోగస్తులకు తోటివారి ధోరణి చికాకు పరుస్తుంది. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుండి సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం. సేవ, పుణ్య కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. వ్యవసాయ రంగాల వారికి అన్ని విధాలా అనుకూలం. 
 
మిథునం :- సాంఘిక, సేవా కార్య క్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమోబైల్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థల్లో వారికి, ఆడిటర్లకి ఒత్తిడి పనిభారం అధికమవుతుంది.
 
కర్కాటకం :- ఉపాధ్యాయులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. పోస్టల్, ఎల్.ఐ.సి. ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ప్రముఖుల కలయికతో అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తి కావు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటాయి.
 
సింహం :- కిరణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. ప్రముఖుల ప్రమేయంతో ఒక సమస్యను అధికమిస్తారు. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. స్త్రీలకు బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి.
 
కన్య :- ఆస్తి వ్యవహారాల్లో దాయాదుల నిర్ణయాలను వ్యతిరేకిస్తారు. మీరెదురు చూస్తున్న రశీదులు, విలువైన పత్రాలు అందుకుంటారు. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం. మీ సరదాలు, కోరికలు వాయిదా వేసుకోవలసివస్తుంది.
 
తుల :- విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు అయిన వారు, చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. దంపతుల మధ్య అవగాహన లోపం, చికాకులు చోటుచేసుకుంటాయి. ఖర్చులు ఊహించినవే కావటంతో ఇబ్బందులంతగాఉండవు.
 
వృశ్చికం :- పత్రికా, వార్తా సంస్థల్లోని వారికి చికాకులు తప్పవు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. పెద్దల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
ధనస్సు :- వృత్తుల వారికి కలిసిరాగలదు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, హడావుడి ఎదుర్కుంటారు. స్త్రీలు వాయిదాల పద్ధతిన విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు, నగదు అవార్డు వంటి శుభ సంకేతాలున్నాయి.
 
మకరం :- ఆర్థికంగా పురోగమించటానికి కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్యంలో సంతృప్తి ఉండదు. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
 
కుంభం :- వృత్తులు, ఎల్.ఐ.సి. ఏజెంట్లకు సామాన్యం. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు, పత్రాలు చేజార్చుకుంటారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి పురోభివృద్ధి. రుణ యత్నాలు ఫలిస్తాయి. అసాధ్యమనుకున్న ఒక పని అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. పత్రికా సంస్థలలోని వారికి తప్పులు దొర్లే ఆస్కారం ఉంది.
 
మీనం :- సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనచోదకులకు ఊహించిన ఆటంకాలెదురవుతాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. మీ వాక్చాతుర్యంతో ఎదుటివారిని మెప్పిస్తారు. స్త్రీలు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగ యత్నాలు ఆశాజనకంగా సాగుతాయి.