శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 22-01-2023 ఆదివారం దినఫలాలు - ఆదిత్యుని మంకెన పూలతో ఆరాధించిన శుభం

Adithya hrudayam
మేషం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఖర్చులు అధికం. రవాణా రంగాల వారికి ప్రయాణికులతో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబీకులతో, సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. 
 
వృషభం :- సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. సన్నిహితులు సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. 
 
మిథునం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. బంధువులతో విభేదాలు, పట్టింపులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
కర్కాటకం :- ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. కార్మికులకు కృషికి తగిన ప్రతిఫలం పొందుతారు. వాహనచోదకులకు చికాకులు తలెత్తుతాయి. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. 
 
సింహం :- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తిఅధికమవుతుంది. 
 
కన్య :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా వెంటనే సమసిపోగలవు. స్త్రీలకు రచనలు, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ పెద్దల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
తుల :- కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసినవారు మీ సహాయం, సహకారాలు అర్థిస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి, ఇతరత్రా చికాకులు ఎదుర్కోక తప్పదు. విద్యార్ధులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. ప్రముఖుల కలయిక సాధ్యపడుతుంది.
 
వృశ్చికం :- ముఖ్యులలో ఒకరి వైఖరి మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువుఇవ్వటం మంచిది కాదని గమనించండి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూరు చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ఇతరులకు ధనం ఇచ్చినా తిరిగి రాజాలదు.
 
ధనస్సు :- పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే ముందు పునరాలోచన చాలా అవసరం. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి అధికమవుతుంది. 
 
మకరం :- బంధువులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వూలు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికం. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు ఆరోగ్యంలోను, షాపింగ్‌ను ఏకాగ్రత అవసరం.
 
కుంభం :- బంధువుల రాక వల్ల మీ పనులు వాయిదాపడతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రత్యర్థులు మీకు అనూహ్యంగా మీకు మద్దతు ఇస్తారు. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విందులలో పరిమితి అవసరం.
 
మీనం :- ఆకస్మిక ఖర్చులు మీదపడటంతో ఒకింత ఒడిదుడుకులు తప్పవు. కుటుంబీకుల కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రముఖుల కలయికతో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.