గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (23:22 IST)

165 వెటర్నరీ అంబులెన్స్ యూనిట్ల ప్రారంభం.. చిన్నపాటి ల్యాబ్ కూడా..

jagan
దేశంలో మొట్టమొదటిగా ప్రత్యేకమైన వెటర్నరీ అంబులెన్స్‌లను అందించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఏడాదిన్నర తర్వాత ఏపీ సర్కారు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జంతువులకు తక్షణ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించే లక్ష్యంతో రెండవ దశను ప్రారంభించింది. ఇందులో చిన్నపాటి ల్యాబ్ కూడా వుంటుంది. 
 
ఏపీ సీఎం జగన్ తాజాగా అదనంగా 165 వెటర్నరీ అంబులెన్స్ యూనిట్లను జెండా ఊపి ప్రారంభించారు. దీంతో ప్రభుత్వం రూ.240.69 కోట్లతో మొత్తం 340 వెటర్నరీ అంబులెన్స్‌లతో నాణ్యమైన వైద్యసేవలు అందించనుంది.
 
ప్రాథమిక వైద్య సేవలతో పాటు, పశువైద్య అంబులెన్స్‌లు జంతువులు, గొర్రెలు, మేకలు, పెంపుడు జంతువులకు చిన్న శస్త్రచికిత్సలు చేయడానికి కూడా రూపొందించబడ్డాయి. మే 2021లో అత్యాధునిక సౌకర్యాలతో వెటర్నరీ అంబులెన్స్‌లను తొలివిడతలో భాగంగా 175 అంబులెన్స్ యూనిట్లను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.