గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (22:51 IST)

మైనర్ బాలికపై 400 మంది అత్యాచారం.. ఆమె రెండు నెలల గర్భవతి

మహారాష్ట్రలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 400 మంది.. ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆరునెలల పాటు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉండడం సమాజానికి సిగ్గుచేటుగా మారింది. ప్రస్తుతం బాలిక రెండు నెలల గర్భవతి. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర బీద్‌ జిల్లాకు చెందిన ఒక మైనర్ బాలిక కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమె తల్లి రెండేళ్ల క్రితం మృతి చెందగా.. తండ్రి ఆమెను భరించలేక ఆమెకు వివాహం చేసి చేతులు దులుపుకున్నాడు. అత్తారింట్లో బాలిక ప్రత్యేక్ష నరకం చూసింది. భర్త, మామ వేధింపులు తతుకోలేక ఉద్యోగ నిమిత్తం అంబేజోగై అనే గ్రామానికి వెళ్ళింది. అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తులు బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నారు.
 
అనంతరం తాము ఎవరిదగ్గరకు వెళ్లమంటే వారి దగ్గరకు వెళ్లాలని, లేకపోతే ఈ విషయం భర్తకు చెప్తానని బెదిరించి వారి స్నేహితుల వద్దకు పంపించేవారు. ఆరునెలల్లో దాదాపు 400 మంది మృగాళ్ల వద్దకు బాలికను పంపించి నరకం చూపించారు. 
 
ఇందులో ఒక బాధ్యత కల్గిన పోలీస్ ఆఫీసర్ కూడా ఉండడం గమనార్హం. ఇక వారి బాధలు తట్టుకోలేని బాలిక దైర్యం చేసి వారి వద్ద నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలిగ చూసింది. ప్రస్తుతం బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిరక్షిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల వివరాలను కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు.