శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (22:35 IST)

చెన్నైలో భారీ వర్షాలు: ముగ్గురు మృతి

చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయగా.. మళ్లీ వర్షం నీటితో నిండాయి. మెట్రో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  

 
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని కుండపోత వర్షాలు రాష్ట్రాన్ని దెబ్బతీశాయి. గురువారం తమిళనాడులో వర్ష సంబంధిత ప్రమాదాల్లో ముగ్గురు మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రి కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్ తెలిపారు. తీరాల వెంబడి తుఫాను భారీ వర్షపాతాన్ని ప్రేరేపించడంతో రాజధాని నగరం చెన్నైని 17 సెంటీమీటర్ల వరకు వర్షాలు ముంచెత్తాయి.