గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (10:31 IST)

దేశంలో ఒమిక్రాన్ కేసులు 236 - తమిళనాడులో 34

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన వివరాల మేరకు 236 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నట్టుండి 34 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. వీరందరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారు కావడం గమనార్హం. తమిళనాడులో నమోదైన ఒమిక్రాన్ కేసులను కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 270కు చేరింది. 
 
అలాగే, దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 7495 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ నుంచి 6960 మంది కోలుకున్నారు. మరో 434 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో 78,291 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా మహారాష్ట్రలో 65, ఢిల్లీలో 64, తమిళనాడులో 34, తెలంగాణాలో 24, రాజస్థాన్‌లో 21, కర్నాటలో 19, కేరళలో 15, గుజరాత్‌లో 14 చొప్పున నమోదైవున్నాయి.