ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (13:46 IST)

సుప్రీంకోర్టుకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులు

సుప్రీంకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు నియమితులు కానున్నారు. వీరిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కొహ్లీ కూడా ఉన్నారు. సుప్రీంకోర్టుకు జడ్జిలుగా మొత్తం 9 మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. వారిలో ముగ్గురు మహిళలు ఉండటం గమనార్హం. 
 
తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కొహ్లీ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న, గుజరాత్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ బేల త్రివేది ఉన్నారు. అలాగే సుప్రీం కోర్టు బార్ నుంచి తెలుగు న్యాయవాది జస్టిస్‌ పీఎస్‌ నరసింహ కూడా కొలీజియం సిఫార్స్ చేసిన వారిలో ఉన్నారు. 
 
అయితే, నాగరత్న, నరసింహకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. న్యాయమూర్తులు ఏఎస్‌ ఓకా, విక్రమ్‌, జేకే మహేశ్వరి, సీటీ రవికుమార్‌, సుందరేష్‌లను కొలీజియం సిఫార్సు చేసింది.