శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (15:34 IST)

పెగాసస్ స్పైవేర్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

పెగాసస్‌ స్పైవేర్‌ స్కామ్‌పై విచారణను సుప్రీంకోర్టు మరోమారు విచారణను వాయిదా వేసింది. పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లపై కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్య కాంత్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. 
 
పిటిషనర్ల ప్రతులు అందాయని, అధ్యయనం చేస్తున్నానని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాలని శుక్రవారానికి వాయిదా వేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. అయితే, శుక్రవారం విచారణ జరపలేమని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ స్పష్టం చేశారు.
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. దీనిపై సోమవారం నిర్ణయం తీసుకుంటామన్న భారత ప్రధాన న్యాయమూర్త విచారణను సోమవారానికి వాయిదా వేశారు.