శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2016 (10:14 IST)

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం: 63మందికి పైగా మృతి.. ప్రధాని దిగ్భ్రాంతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 63 మందికిపైగా మరణించారు. రైలులోని 14 బోగీలు పట్టాలు తప్పడంతో అనేకమందికి గాయాలయ్యాయి. కాన్‌పూర్‌దేహత్‌ జిల్లా పుఖ్రాయాన్‌ వద్ద ఇండోర్‌-పట్నా ఎక్స

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 63 మందికిపైగా మరణించారు. రైలులోని 14 బోగీలు పట్టాలు తప్పడంతో అనేకమందికి గాయాలయ్యాయి. కాన్‌పూర్‌దేహత్‌ జిల్లా పుఖ్రాయాన్‌ వద్ద ఇండోర్‌-పట్నా ఎక్స్‌ప్రెస్‌ ఈ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై సమాచారమందుకున్న అధికారులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
 
కాగా... ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయని రైల్వేఅధికారులు మీడియాకు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
 
ఇదిలా ఉంటే.. యూపీలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో ప్రధాని మాట్లాడారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మోడీ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 
 
మరోవైపు పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు స్పందించారు. సీనియర్‌ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
 
అలాగే స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించాలని యూపీ డీజీపీని ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్ ఆదేశించారు. ఉత్తరప్రదేశ్‌లోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్‌ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పిన ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.