రాజస్థాన్‌లో విషాదం.. శివరాత్రి వేడుకల్లో పూజారులు పెట్టిన ప్రసాదం తిని...
మహాశివరాత్రి పర్వదినంన రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో విషాదం నెలకొంది. ఓ ఆలయం వద్ద ఇచ్చిన ప్రసాదం తిని 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, వైద్యులు.. దుంగార్‌పూర్ చేరుకుని బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
ఫుడ్ పాయిజన్ వల్లే భక్తులు అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన వ్యక్తుల నుంచి నమూనాలను సేకరించి, టెస్టు నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.
రాజస్థాన్ రాజ్‌భవన్‌లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా.. రాజ్‌భవన్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు రాజ్‌భవన్ సిబ్బంది హాజరయ్యారు. సీఎం అశోక్ గెహ్లాట్ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపి పూజలు నిర్వహించారు.