గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)
గంగానదిలో తేలియాడుతున్న రాయి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలోని గ్రామస్తులు గంగానదిలో తేలియాడుతున్న రాయిని చూసారు. సుమారు 3 క్వింటాళ్ల బరువు వున్న ఆ రాయిని ఒడ్డుకి తీసుకువచ్చారు. అది మహిమాన్వితమైన రాయిగా భావించి మహిళలు పూజించడం ప్రారంభించారు.
ఘాజీపూర్‌లోని దాద్రి ఘాట్ వద్ద ఒక పెద్ద రాయి గంగానదిలో తేలుతూ వచ్చింది. ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజలు ఆ రాయిని విశ్వాసంతో పూజిస్తున్నారు. ప్రజలు ఆ రాయిని అద్భుతం అని పిలుస్తున్నారు. పురుషులు, స్త్రీలు ఆ రాయిని పూజిస్తున్నారు. ఆ రాయి ప్రవాహంలో తేలుతూ వెళ్లిపోకుండా వుండేందుకు తాడుతో దానిని కట్టేసారు. ఈ రాయి వారణాసి నుండి వస్తోందని చెబుతున్నారు.
సీతను కాపాడేందుకు లంకకి వెళ్లే క్రమంలో శ్రీరామచంద్రుడు ఇలాంటి రాళ్లనే రామసేతుకి వినియోగించి వుంటారని అక్కడివారు చెప్పుకుంటున్నారు. మరి ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చిందన్నది నిపుణులు తేల్చాల్సి వుంది.