మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (12:04 IST)

ప్రేమించిన యువకుడితో జంప్ అవుతుందని.. తల నరికేశారు

బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన పాపానికి కన్నకూతురు తలనే నరికేశారు.. ఆ తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళితే.. బీహార్, పాట్నాకు చెందిన 16 ఏళ్ల బాలిక అదృశ్యమైందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో తల నరికేసిన స్థితిలో బాలిక మృతదేహాన్ని పోలీసులుకు కనుగొన్నారు. 
 
ఆపై బాలిక హత్యకు ఎవరు కారణమనే దానిపై జరిపిన దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన బాలిక ఓ యువకుడి ప్రేమలో వున్నదని.. అతనిని పెళ్లాడేందుకు ఇంటి నుంచి పారిపోవాలని భావించిందని అందుకే తల్లిదండ్రులు బాలికను దారుణంగా హత్య చేశారని తేలింది. దీంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.