ఒడిస్సా హాస్టల్‌‌ విద్యార్థినికి కాన్పు.. కారణం ఎవరు? పురిటి నొప్పులు వచ్చేదాకా?

baby legs
Last Updated: సోమవారం, 14 జనవరి 2019 (11:12 IST)
ఒడిస్సాలోని హాస్టల్‌‌లో బసచేసి చదువుకునే 8వ తరగతి విద్యార్థినికి కాన్పు జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఒడిస్సా, కందమాల్ జిల్లాలోని ఓ పాఠశాలలో చదివే విద్యార్థిని ఓ హాస్టల్‌లో బస చేసింది. ఈ హాస్టల్‌లో వుంటే చదువుకున్న 8వ తరగతి విద్యార్థినికి ఉన్నట్టుండి కడుపులో నొప్పి ఏర్పడింది. 
 
నొప్పిని తట్టుకోలేక నరకయాతన అనుభవించిన ఆమెను హాస్టల్ సిబ్బంది ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలికను పరిశోధించిన వైద్యులు ఆమె గర్భంగా వున్నట్లు నిర్ధారించారు. గంటల వ్యవధిలో కాన్పు జరుగనుందని కూడా చెప్పేశారు. 
 
వైద్యులు చెప్పినట్లు చిన్నారికి పండంటి బిడ్డ పుట్టింది. దీంతో షాకైన విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్ వార్డెన్, కుక్ మాస్టర్‌లతో పాటు పలువురి వద్ద విచారణ జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :