భార్యకు కూల్ డ్రింకులో మత్తుమందు, నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్
కేరళ రాష్ట్రం తిరువనంతపురంకు చెందిన మహిళపై కట్టుకున్న భర్త కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చి తన నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదంతా తన ఐదేళ్ల కుమారుడు కళ్ల ముందే జరిగింది. కేళలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి.
నిన్నరాత్రి మహిళ భర్త తన నలుగురు స్నేహితులను ఇంటికి తీసుకవచ్చాడు. పూటుగా మద్యం సేవించారు. అనంతరం భార్యకు తెలియకుండా కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఆమెతో తాగించారు. ఆమె కాస్త అపస్మారకంలోకి వెళ్లాక తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అత్యాచారం చేస్తూ ఆమె శరీరంపై సిగరెట్లతో కాల్చి చిత్రహింసలకు గురిచేశాడు. తనపై జరిగిన దారుణాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు ఆమె భర్తతో సహా నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిపై అత్యాచారం, కిడ్నాప్ తదితర కేసులు నమోదు చేశారు. సంఘటనపై స్పందించిన కేరళ రాష్ట్ర వైద్య శాఖామంత్రి శైలజ, జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి కేసును వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.