బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 13 ఆగస్టు 2018 (19:59 IST)

హిజ్రా హన్సికను ప్రేమించాడు.. పెళ్ళి చేసుకున్నాడు... ఎక్కడ?

అతను ఆమెగా మారిపోయాడు. సమాజంలో తను మగాడిగా ఉండటం అతనికి ఇష్టం లేదు. అమ్మాయిగా ఉండాలన్నదే అతని కోరిక. దీంతో తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయి అమ్మాయిగా మారిపోయాడు. అంతేకాదు ఆ తరువాత హిజ్రా కూడా అయిపోయాడు. హిజ్రా అయిన అతన్ని ఒక వ్యక్తి గాఢంగా

అతను ఆమెగా మారిపోయాడు. సమాజంలో తను మగాడిగా ఉండటం అతనికి ఇష్టం లేదు. అమ్మాయిగా ఉండాలన్నదే అతని కోరిక. దీంతో తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయి అమ్మాయిగా మారిపోయాడు. అంతేకాదు ఆ తరువాత హిజ్రా కూడా అయిపోయాడు. హిజ్రా అయిన అతన్ని ఒక వ్యక్తి గాఢంగా ప్రేమించాడు. పెళ్ళి కూడా చేసేసుకున్నాడు. ఇదంతా ఎక్కడో కాదు తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో జరిగింది.
 
పుదుప్పేట్టకు అతి సమీపంలో ఎస్సి కాలనీ ఉంది. ఆ కాలనీలో మణి ప్లస్ టు(ఇంటర్ సెకండియర్) చదువుతున్నాడు. తమ కళాశాలకు ఒకసారి కొంతమంది హిజ్రాలు వచ్చారు. విరాళాలు సేకరించారు. ఆ హిజ్రాలలో హన్సిక... మణికి బాగా నచ్చేసింది. ఆ తరువాత హన్సిక ఎక్కడ ఉందో కనుక్కుని వెంటపడ్డాడు. ప్రేమిస్తున్నానన్నాడు. హిజ్రాలందరూ ముందు మణిని హేళన చేశారు. కొంతమంది అయితే కొట్టారు. నీకేమైనా పిచ్చా.. మా గురించి నీకు తెలుసు కదా అంటూ చెప్పారు. అయినా మణిలో మార్పు లేదు. ప్రేమిస్తున్నానంటూ మళ్ళీ వెంటపడ్డాడు.
 
దీంతో హన్సికకు మణిలోని నిజమైన ప్రేమ అర్థమైంది. మణి ఇంటిలో తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోకున్నా.. ఆ తరువాత హిజ్రాలందరూ కలిసి ఒప్పించారు. కంచి సమీపంలోని శక్తి స్వరూపిణి అమ్మ ఆలయంలో వీరు వివాహం చేసుకున్నారు. సమాజం తమను ఏమనుకున్నా ఫర్వాలేదంటున్నాడు మణి. ఇద్దరూ కలిసి మణి ఇంటిలోనే కాపురం కూడా పెట్టేశారు.