సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (17:44 IST)

టీవీ ఛానల్ లోకి కత్తి పట్టుకుని దుండగుడు హల్చల్, పరుగులు తీసిన సిబ్బంది

తమిళనాడు నగరం చెన్నైలో ఓ దుండగుడు కత్తి, డాలు తీసుకుని ప్రముఖ టెలివిజన్ ఛానల్ కార్యాలయంలోకి ప్రవేశించాడు. రాయపురంలో వున్న సత్యం టీవీ ఛానల్లోకి చొరబడిని సదరు దుండగుడు అక్కడి ఫోన్లు, అద్దాలు, కంప్యూటర్లను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించాడు.
 
హఠాత్తుగా కత్తితో ప్రవేశించిన ఆ దుండగుడిని చూసి సిబ్బంది పరుగులు తీసారు. అతడు మొదటి అంతస్తులో వున్న అకౌంట్స్ డిపార్టుమెంట్లో వున్న ఫర్నీచర్ చెల్లాచెదురు చేసాడు. దీనితో వెంటనే రాయపురం పోలీసులకు సమాచారం అందివ్వడంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా అతడు ఛానల్ కార్యాలయంలో దాడి ఎందుకు చేసాడన్నది తమకు అర్థం కావడంలేదని సిబ్బంది చెపుతున్నారు.