సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 21 నవంబరు 2017 (21:16 IST)

ఆస్తి కోసం అన్న భార్యపై 9 నెలలుగా అత్యాచారం...

అన్న భార్య అంటే తల్లితో సమానం అంటారు. అలాంటి తల్లితో సమానమైన స్త్రీపై 9 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళితే... ముంబైలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల మహిళ తన భర్తతో నివాసముంటోంది. ఐతే ఇటీవల ఆమె భర్త మానసికంగా దెబ్బ

అన్న భార్య అంటే తల్లితో సమానం అంటారు. అలాంటి తల్లితో సమానమైన స్త్రీపై 9 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళితే... ముంబైలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల మహిళ తన భర్తతో నివాసముంటోంది. ఐతే ఇటీవల ఆమె భర్త మానసికంగా దెబ్బతిన్నాడు. దీనితో భర్తను ఆసుపత్రిలో చేర్చి కుటుంబ బాధ్యతను తనే చూసుకుంటూ వస్తోంది. 
 
ఐతే వీరి ఆస్తిపై కన్నేశాడు ఆమె మరిది. తన అన్నయ్య మతి స్థిమితం కోల్పోయాడు కనుక ఆస్తినంతా తన పేరున రాయాలని వొదినను పట్టుబట్టాడు. అందుకు ఆమె ససేమిరా అంది. గట్టిగా ఒత్తిడి చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. దీనితో ఓ రోజు రాత్రి పూటుగా మద్యం సేవించిన అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. 
 
గత తొమ్మిది నెలలుగా ఆమెపై ఈ అఘాయిత్యం చేస్తూనే వున్నాడు. అటు భర్త అనారోగ్యం, ఇటు కామాంధుడి వేధింపులను తట్టుకోలేని మహిళ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేశారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.