శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (08:15 IST)

జనన, మరణ ధ్రువీకరణకు ఆధార్‌ తప్పనిసరికాదు

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నమోదుకు ఆధార్‌ తప్పనిసరికాదని రిజిస్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌జిఐ) ప్రకటించింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద జనన, మరణాల నమోదుకు ఆధార్‌ తప్పనిసరి అవునా, కాదా అని తెలపాలంటూ విశాఖపట్నంకు చెందిన న్యాయవాది ఎంవిఎస్‌.కుమార్‌ రాజ్‌గిరి ఆర్‌టిఐని కోరారు.

ఆధార్‌ను సమర్పించడం సభ్యుల ఐఛ్చికమని ఒక సర్క్యులర్‌ను గతవారం ఆర్‌జిఐ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఒక వేళ సమర్పించిన్పటికీ.. ఆధార్‌ నెంబర్‌ను ఏ పత్రంలోనూ ముద్రించకూడదని, సమాచార రూపంలోనూ ఉంచకూడదని ఆర్‌జిఐ సర్క్యులర్‌లో పేర్కొంది.

ఈ సర్క్యులర్‌ను జనన, మరణాలను నమోదు చీఫ్‌ రిజిస్ట్రార్‌లకు పంపుతామని తెలిపింది. అయితే ఈ నిబంధనల అమలు రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల నిర్ణయాన్ని బట్టి ఉంటుందని పేర్కొంది.

కాగా, 1969 జనన మరణాల రిజిస్ట్రేషన్‌ (ఆర్‌బిడి) చట్టం ప్రకారం.. జననాలు, మరణాలను నమోదు చేస్తున్నారు. అయితే ఒక వ్యక్తి ధ్రువీకరణకు వీలు కల్పించే ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57 రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.