1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (12:54 IST)

అమీర్ ఖాన్ తల్లికి గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక

amir khan mother
బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ముంబైలోని పంచగని అమీర్ ఖాన్ కుటుంబం దీపావళి వేడుకల్లో నిమగ్నమైవుండగా, జీనత్ హుస్సేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 
 
దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్టు ఓ జాతీయ మీడియా పేర్కొంది. 
 
మరోవైపు, తన తల్లి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అమీర్ ఖాన్ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. అయితే, తన ఆరోగ్యంపై అమీర్ ఖాన్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.