మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Srinivas
Last Updated : బుధవారం, 9 మే 2018 (13:58 IST)

మోదీని వ్యతిరేకిస్తున్నానని బాలీవుడ్ తొక్కేస్తోంది... చంద్రబాబు నిస్సహాయం: ప్రకాష్ రాజ్

మోడీని వ్యతిరేకిస్తున్నందుకు బాలీవుడ్ నన్ను పక్కన పెట్టిందని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తాను గళమెత్తినప్పటి నుంచి తనకు ఆఫర్లు ఇవ్వడాన్ని బాలీవుడ్ ఆపేసిందని చెప్పుకొచ్చారు.

మోడీని వ్యతిరేకిస్తున్నందుకు బాలీవుడ్ నన్ను పక్కన పెట్టిందని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తాను గళమెత్తినప్పటి నుంచి తనకు ఆఫర్లు ఇవ్వడాన్ని బాలీవుడ్ ఆపేసిందని చెప్పుకొచ్చారు. గత అక్టోబరులో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య నేపథ్యంలో మోదీ మౌనాన్ని తాను విమర్శించినప్పటి నుంచి హిందీ సినీపరిశ్రమ తనను పక్కన పెట్టేసిందని చెప్పారు. దక్షిణాది సినీపరిశ్రమలో ఇలాంటి సమస్య లేదని అన్నారు. తన వద్ద కావాల్సినంత డబ్బు ఉందని... బాలీవుడ్‌లో సినిమాలు రానంత మాత్రాన పెద్ద సమస్య ఏమీ లేదన్నారు.
 
ఇకపోతే రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపించడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల హక్కు అని చెప్పుకొచ్చారు. దాన్ని సాధించుకుని తీరాల్సిందేనంటూ వెల్లడించారు. ఐతే ఏపీకి ఏదో ఒకటి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. కేంద్ర వైఖరితో చంద్రబాబు నిస్సహాయులుగా వున్నారనీ, ఆయన్ని ఏమీ అనలేమని వెల్లడించారు.