మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2016 (11:02 IST)

లెక్కల్లో చూపని అక్రమార్జన రూ.17 కోట్లు : అంగీకరించిన రామ్మోహన్ రావు తనయుడు

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావు తనయుడు తమ అక్రమార్జనను అంగీకరించాడు. ఆదాయ లెక్కల్లో చూపని రూ.17 కోట్లు తమ వద్ద ఉన్నాయని ఆదాయపన్ను అధికారులకు సీఎస్‌ రామ్మోహనరావు తనయుడు వివేక్‌ చె

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావు తనయుడు తమ అక్రమార్జనను అంగీకరించాడు. ఆదాయ లెక్కల్లో చూపని రూ.17 కోట్లు తమ వద్ద ఉన్నాయని ఆదాయపన్ను అధికారులకు సీఎస్‌ రామ్మోహనరావు తనయుడు వివేక్‌ చెప్పాడు. ఇందులో రూ.ఐదు కోట్లను బుధవారం వెల్లడించారని వివరించారు. కాగా, ఆయన ఇంటి నుంచి 10 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా, రామ్మోహన్ రావు‌, ఆయన కుటుంబీకులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ తనిఖీలు ముగిశాయి. గురువారం కూడా ఐదుచోట్ల తనిఖీలు జరిపారు. రెండు రోజులపాటు జరిపిన ఈ తనిఖీల్లో మొత్తం 15 కిలోల బంగారం, రూ.24 లక్షల నగదు, కీలక సమాచారం తెలిపే ల్యాప్‌టాప్‌, మూడు హార్డ్‌ డిస్కులు, పెన్‌డ్రైవ్‌లు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. రామ్మోహన్ రావు కార్యాలయం నుంచి మొత్తం 40 ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. 
 
మొత్తం 13 చోట్ల జరిగిన తనిఖీల్లో వంద కోట్లకుపైగా విలువ చేసే ఆస్తిపాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తిరువాన్మియూరులోని రామ్మోహన్ రావు కుమారుడు వివేక్‌ నివాసం, నందనం సిగ్నల్‌ వద్ద ఉన్న ఆయన కార్యాలయం, వలసరవాక్కంలోని వివేక్‌ న్యాయవాది అమల్‌నాథన ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. వివేక్‌ ఆస్తిపాస్తులకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి.