శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (13:55 IST)

2020కి ఏమైంది..? ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలే.. ముంబైలో?

2020కి ఏమో అయ్యింది. ఈ ఏడాది ప్రపంచానికి అంతలా కలిసిరాలేదు. ఎక్కడ చూసినా ప్రమాదాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రాణ నష్టాలను మిగిలిస్తోంది. మానవ తప్పిదాల వల్ల పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 
 
ఇక విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే మరో రెండు మూడు చోట్ల గ్యాస్ లీక్ ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఇదే తరహాలో ప్రస్తుతం ముంబైలో కూడా చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని చెంబూర్ సమీపంలోని గోవండి (ఈస్ట్) ప్రాంతంలో గల యూఎస్ విటమిన్ ఫార్మా కంపెనీ నుంచి శనివారం రాత్రి 9.53 నిమిషాలకు గ్యాస్ లీక్ అయినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
 
ఇక ఈ గ్యాస్ లీక్ అవడం వల్ల దీని ప్రభావం ఐదు ప్రాంతాలపై తీవ్రంగా పడగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ సంఘటన గురించి తెలుసుకున్న ముంబై అధికారులు 17 బృందాలను అక్కడికి పంపి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి పరిస్దితిని అదుపులోకి తెచ్చినట్టు వెల్లడించారు.