ముంబైకి మరో ముప్పు.. నిసర్గ తుఫాన్ దూసుకొస్తోంది.. 130 ఏళ్ల తర్వాత?
కరోనా కోరల్లో చిక్కుకున్న ముంబైకి మరో ముప్పు పొంచివుంది. ముంబై మహానగరాన్ని ముంచెత్తేందుకు నిసర్గ తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం.. సోమవారం వాయుగుండంగా బలపడింది.
ఈ తుఫాను జూన్ 3 మధ్యాహ్నానికి దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరాలను దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. డామన్, మహారాష్ట్ర మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. నిసర్గ తుఫాన్ ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్‌పై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ముంబైపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశముందని హెచ్చరించారు.
ముంబైని చివరగా 2009 నవంబరులో ఫయాన్ తుఫాన్ తాకిందని ప్రముఖ వాతావరణ నిపుణుడు జాసన్ నికోలస్ తెలిపారు. అంతేకాదు 1891లో జూన్ నెలలో చివరిసారిగా ముంబైని తుఫాన్ ముంచెత్తిందని.. మళ్లీ 130 ఏళ్ల తర్వాత జూన్ నెలలో ముంబై తీరానాన్ని తుఫాన్ ముంచెత్తబోతోందని పేర్కొన్నారు.