మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 3 అక్టోబరు 2018 (12:25 IST)

షాకింగ్... తల్లి శవంపై కూర్చుని కుమారుడు అఘోర పూజ...

తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తల్లి మృతదేహంపై కూర్చుని అఘోర పూజ చేయడం కలకలం సృష్టిస్తోంది. దేవుడి కోసం తమ జీవితాలను అర్పించామని చెప్పుకుంటూ హిమాలయాల్లో కనిపించే అఘోరాలు, స్మశానాల్లో జీవించడం కర్తవ్యంగా భావిస్తారు. ప్రస్తుతం తమిళనాడులోని అనేక ప్రాంత

తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తల్లి మృతదేహంపై కూర్చుని అఘోర పూజ చేయడం కలకలం సృష్టిస్తోంది. దేవుడి కోసం తమ జీవితాలను అర్పించామని చెప్పుకుంటూ హిమాలయాల్లో కనిపించే అఘోరాలు, స్మశానాల్లో  జీవించడం కర్తవ్యంగా  భావిస్తారు. ప్రస్తుతం తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో తమ ఇష్టదేవతలకు ఆలయాలను నిర్మించి పూజలు చేస్తున్నారు. 
 
అందులో భాగంగా తిరుచ్చి జిల్లా తిరువెరుంబూరు సమీప అరియమంగళంలో జై అఘోర కాళీ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కాశీలో అఘోర శిక్షణ పొందిన మణికంఠన్ నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ఈ నెల 10వ తేదీన వార్షికోత్సవం ప్రారంభం కానుంది. 
 
ఈ నేపథ్యంలో మణికంఠన్ తల్లి మృతి చెందింది. ‌ఆమె అంత్యక్రియలను అరియ మంగళం స్మశాన వాటికలో జరిపారు. ముందుగా ఆమె మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళారు. ఇందులో అఘోరాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తల్లి అంత్యక్రియల్లో అఘోరాగా మారిన కుమారుడు ఆమె శవంపై కూర్చుని పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది.