బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (10:25 IST)

ప్రధాని మోడీకి అంత అహంకారం పనికిరాదు : అకాలీదళ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఎన్డీయే మిత్రపక్షమైన అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై టీడీపీ అసంతృప్తి వ్యక్త

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఎన్డీయే మిత్రపక్షమైన అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేయగా, దానికి ఇతర పార్టీల మద్దతు పెరుగుతోంది. ఇలా మద్దతు ప్రకటించిన పార్టీల్లో అకాలీదళ్ ఒకటి. 
 
ఈ సందర్భంగా ఎంపీ నరేశ్ గుజ్రాల్ మాట్లాడుతూ, 'ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్న తెలుగుదేశం అసంతృప్తి సహేతుకమైనదే. ఏపీ ఏర్పడినపుడు ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంట్ వేదికపైనే వాగ్దానం చేశారు. దాన్ని అమలు చేయకపోవడం సరైనది కాదన్నారు. 
 
ముఖ్యంగా, బీజేపీ సంకీర్ణధర్మాన్ని పాటించాలి. వాజపేయి నుంచి బీజేపీ సంకీర్ణ ధర్మాన్ని నేర్చుకోవాలి. మిత్రపక్షాలతో వారు సరిగా వ్యవహరించడం లేదు. వ్యక్తి గురించి కాక మొత్తం బీజేపీ గురించి మాట్లాడుతున్నట్టు చెప్పుకొచ్చారు. కాగా, వచ్చే ఎన్నికల్లో అకాలీదళ్ ఒంటరిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే.