శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (10:43 IST)

ఏప్రిల్ 14న క్లోజ్డ్ హాలిడే.. లాక్‌‍డౌన్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందా?

దేశవ్యాప్తంగా ప్రజలు లాక్ డౌన్‌లో వున్న నేపథ్యంలో.. ఏప్రిల్ 14వ తేదీ ప్రస్తుతం కీలకంగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో భాగంగా కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ముగిసేది ఏప్రిల్ 14. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.

లాక్ డౌన్ ముగిసే ఏప్రిల్ 14ను అధికారిక సెలవు దినంగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే.. ఆ రోజు రాజ్యాంగ సృష్టికర్త బీఆర్ అంబేద్కర్ జయంతి కావడంతో.. కేంద్రం సెలవుగా ప్రకటించింది. ఇదే రోజున లాక్ డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు దేశవ్యాప్త లాక్ డౌన్‌ను పొడిగిస్తారా.? లేదా ఆంక్షలతో కూడిన సడలింపులతో ఎత్తివేస్తారా.? అన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అది మూడో దశకు చేరుకోకుండా మరికొన్ని రోజులు లాక్ డౌన్ విధించాలని కొంతమంది రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
 
అటు మోదీ కూడా పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేసే ఛాన్సులు లేవని చెప్పకనే చెప్పేశారు. అయితే ఎన్ని రోజుల వరకు లాక్ డౌన్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్ని రోజుల వరకు లాక్ డౌన్ పొడిగించాలన్న విషయాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో లాక్ డౌన్ చివరి తేదీ ఏప్రిల్ 14న జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.