ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (20:05 IST)

భేష్, బ్రహ్మాండం.. దుబ్బాక గెలుపుపై బండి సంజయ్‌కి అమిత్ షా అభినందన

బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడు పెరిగిందని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బండి సంజయ్ పైన అభినందనలు వెల్లువెత్తాయి. దీంతో సంజయ్‌కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు.
 
దుబ్బాకలో విజయం సాధించడంపై ఆయనను అభినంధించారు. మరోవైపు ఎన్నికల ప్రచారం సందర్భంగా సంజయ్ పైన దాడి జరిగినప్పుడు కూడా అమిత్ షా ఫోన్ చేశారు. దాడి వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదు బీజేపీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది.
 
రాష్ట్ర కీలక నేతలంతా కార్యాలయంలో ఉన్నారు. మరోవైపు అమర వీరుల స్థూపం వద్ద బండి సంజయ్ నివాళులు అర్పించారు. దుబ్బాక గెలుపును అమర వీరుడు శ్రీనివాస్‌కు అంకితమిస్తున్నట్లు తెలిపారు.