గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (14:00 IST)

పొలంలో అర్ధనగ్నంగా బాలిక మృతదేహం.. గోళ్లతో రక్కిన మరకలు..

యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతున్నాయి. అలీగఢ్‌ జిల్లాలో మైనర్‌ బాలికపై లైంగిక దాడి అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలిక మృతదేహంపై గోళ్లతో రక్కిన మరకలున్నాయి. బాధితురాలిని పంటపొలంలోకి లాక్కెళ్లి దుండగులు దారుణానికి ఒడిగట్టారు.
 
పొలంలో అర్ధనగ్నంగా పడి ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులుగా భావిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని స్ధానిక పోలీసులు వెల్లడించారు.