గర్ల్ ఫ్రెండ్స్ లేరుగా.. నాతో స్నేహం చేస్తారా?
బడా వ్యాపారికి ఓ అందమైన అమ్మాయి వలేసింది. గర్ల్ ఫ్రెండ్స్ లేరుగా.. తనతో స్నేహం చేస్తారా.. అంటూ ఓ వ్యక్తికి పరిచయం అయ్యింది. కానీ అతనిని బుట్టలో వేసుకోవాలనే ఆమె ప్రయత్నాలు మాత్రం సాగలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? గుజరాత్, అహ్మదాబాద్‌కు చెందిన విజయ్ నారంగ్ (38) బిజినెస్ మేన్.
అతనికి ఓ అమ్మాయి ఫోన్ ద్వారా పరిచయం అయింది. నిత్యమూ వాట్సాప్‌లో కాల్ చేస్తూ, స్నేహం చేయాలని వేధింపులు ప్రారంభించింది. దీన్ని మోసంగా భావించిన నారంగ్, ఆమె ఫోన్‌ను వాట్స్ యాప్‌లో బ్లాక్ చేశాడు.
అయినా ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌లు పంపడం ప్రారంభించింది. ఆమె వేధింపులు తగ్గకపోవడంతో, నారంగ్ ఇక లాభం లేదనుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేశారు. ఫోన్ కాల్ ఆధారంగా ఆ యువతిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.