శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (13:29 IST)

ఈ నెల 15 నుంచి అస్సాంలో స్కూల్స్ ప్రారంభం

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మూతపడిన స్కూల్స్‌ క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యా సంస్థలను తెరిచేందుకు అనుమతించాయి. తాజాగా అస్సాం ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా పరిస్థితులు, పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో కర్ఫ్యూ సమయాల్లో సడలింపులను కూడా ఉంటాయని ఆయన వెల్లడించారు. అస్సాం రాష్ట్రంలో రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలకు చేరుకుంది. రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ సమయాలు రాత్రి 11 గంటలకు సడలించబడతాయని చెప్పారు.