శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మే 2022 (15:09 IST)

బ్యూటీపార్లర్‌కు వెళ్లిన వధువు.. అట్టే ప్రియుడితో జంప్

bride
మేకప్ కోసం వధువు బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. గంటలైనా తిరిగి రాకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ వెతికినా వధువు కనిపించలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది. పెళ్లికి కేవలం రెండు గంటల ముందు వధువు తన ప్రియుడితో వెళ్లిపోయిందని తెలిసింది.
 
వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జితేంద్ర అనే వ్యక్తికి ఎమ్‌జీ రోడ్ కాలనీకి చెందిన రోషిణీతో వివాహం నిశ్చయమైంది. గురువారం సాయంత్రం వీరి వివాహం జరగాల్సి ఉంది. గురువారం ఉదయమే వరుడి కుటుంబం కల్యాణ మండపానికి చేరుకుంది. 
 
వధువు కుటుంబం వారికి ఆహ్వానం పలికింది. పెళ్లికి రెండు గంటల సమయం ఉందనగా వధువు రోషిణి బ్యూటీ పార్లర్‌కు వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పి బయటకు వెళ్లింది. ముహూర్త సమయం దగ్గరపడుతున్నప్పటికీ ఆమె తిరిగి రాలేదు.
 
వధువు కుటుంబ సభ్యలతో పాటు స్వయంగా వరుడు కూడా రోషిణి కోసం వెతికాడు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలిసింది. ఆకాష్ అనే వ్యక్తితో రోషిణి ప్రేమలో ఉందని, అతడితోనే వెళ్లిపోయిందని తెలిసింది. ఇద్దరి ఫోన్లూ స్విచ్ఛాఫ్ రావడంతో చేసేదేం లేక వరుడి కుటుంబం వెనుదిరిగింది.