బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (11:32 IST)

తనకు పిల్లను చూడమన్న వృద్ధుడు.. అవాక్కైన మంత్రి రోజా

rk roja
తాను ఒంటరిగా జీవిస్తున్నానని, అందువల్ల తనకు పిల్లను చూసిపెట్టాలని ఏపీ రాష్ట్ర మంత్రి ఆర్.కె.రోజా వద్ద ఓ వృద్ధుడు మొరపెట్టుకున్నాడు. ఆ వృద్ధుడి మాటలు వినగానే ఆమె అవాక్కయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని వైకాపా శ్రేణులు చేపట్టాయి. ఇందులోభాగంగా, చిత్తూరు జిల్లా నగరిలో సోమవారం మంత్రి ఆర్.కె.రోజాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. 
 
తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ప్రశ్నించారు. అయితే, ఓ చోట మాత్రం ఆమెకు వింత అనుభవం ఎదురైంది. తనను కలిసిన ఓ వృద్ధుడిని నెలవారీ పింఛను అందుతుందా? అని ప్రశ్నించారు. 
 
అందుకతడు బదులివ్వకుండా తాను ఒంటరివాడినయ్యాని తనకెక్కడైనా పిల్లను చూడాలని కోరారు. ఆ ప్రశ్నకు అవాక్కైన మంత్రి ఒక్కసారిగా ఫక్కున నవ్వేశారు. ఆమెతో పాటు చుట్టుపక్కలవారు కూడా నవ్వును ఆపుకోలేక పోయారు. పెద్దాయన ప్రశ్నకు రోజా బదులిస్తూ తాను పెన్షన్ల మాత్రమే అందేలా చూడగలనని, అమ్మాయిలను చూడటం తనకు పని కాదని ఆ వృద్ధుడికి చెప్పారు.