ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జులై 2024 (13:46 IST)

మటన్ అంటూ కుక్కమాంసాన్ని రవాణా చేశారట.. ఎక్కడ?

meat sale
కర్ణాటక రాజధాని బెంగళూరులో మటన్ అంటూ కుక్కమాంసాన్ని రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌కి రాజస్థాన్‌ నుంచి రైలులో వచ్చిన మాంసం కుక్కమాంసంగా కొందరు ఆరోపించడంతో వివాదం చెలరేగింది. 
 
రాజస్థాన్‌ రాజధాని జైపూర్ నుంచి జైపూర్-మైసూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కుక్క మాంసం రవాణా చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ గందరగోళం నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మాంసం నమూనాలను సేకరించి, పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. వీటిని తనికీ చేయగా 90 బాక్సులు కనిపించాయి. 
 
అందులో జంతువుల మాంసం కనిపించింది. అయితే జంతువుల చర్మం తొలగించి ఉండటంతో అది మేక, గొర్రె మాంసమో లేదా కుక్క మాంసమో తెలియరాలేదు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇతర మాంసాన్ని కలిపే సందర్భాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.