శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జులై 2021 (23:53 IST)

మహిళను నిర్భంధించి తండ్రీకొడుకులు రేప్.. రూ.60వేలకు అమ్మేశారు.. ఎక్కడ?

మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ మహిళను కొన్ని నెలల పాటు నిర్బంధించి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. బాధితురాలిపై తండ్రీకొడుకులు దారుణానికి పాల్పడ్డారు. ఆ తరువాత బాధితురాలిని ఓ వ్యక్తికి రూ.60 వేలకు అమ్మేశారు.

వివరాల్లోకి వెళితే.. బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు సదరు వ్యక్తి తండ్రికొడుకులతో డీల్ కుదుర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వివాహానికి గురించి తెలియడంతో వారు ఆమెను రక్షించి భర్తను అరెస్టు చేశారు.
 
ఉద్యోగ వేటలో ఉన్న బాధితురాలికి నాలుగు నెలల క్రితం రవి పరిచయమైనట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిందితుడు ఆమెపై ఓ రోజు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ తరువాత అతడి తండ్రి రమేశ్‌ కూడా ఈ దారుణానికి తెగించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సర్మన్ ప్రజాపతి అనే వ్యక్తితో డీల్ కుదిరే వరకూ తనపై తండ్రీకోడుకులు దారుణానికి పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. పరారీలో ఉన్న తండ్రీకొడుకుల కోసం పోలీసులు ప్రస్తుతం విస్తృతంగా గాలిస్తున్నారు.