బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జూన్ 2022 (13:50 IST)

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి

Car
Car
బీహార్‌లోని పూర్ణియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకువచ్చిన కారు గుంతలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి గాయాలైనాయి. ఘటనస్థలానికి పోలీసులు చేరుకుని స్థానికుల సాయంతో కారును వెలికి తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 
 
శుక్రవారం రాత్రి తారాబడి ప్రాంతంలో పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని.. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీలు తెలిపారు. కాగా బాధితులంతా కిశన్‌గంజ్‌లోని నునియా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.