మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 మే 2021 (12:51 IST)

ఆస్పత్రిలో కోర్కె తీర్చమన్న వార్డు బాయ్... చితకబాది పోలీసులకు అప్పగింత!

కరోనా ఆస్పత్రిలో చికిత్స పొందున్న రోగికి సహాయకురాలిగా వచ్చిన ఓ మహిళ పట్ల వార్డు బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆస్పత్రిలోనే లైంగిక కోర్కె తీర్చమన్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ మహిళ... వార్డుబాయ్‌ను చితకబాది పోలీసులకు పట్టించింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. 
 
రాష్ట్రంలోని భాగల్ పూర్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో వెలుగుచూసింది. తన భర్తకు, తల్లికి కరోనా సోకడంతో వారికి చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి వారి బాగోగులు చూసేందుకు వివాహిత వచ్చింది. ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్న జ్యోతికుమార్ వివాహితను లైంగికంగా వేధించాడు.
 
దీంతో వార్డు బాయ్ లైంగిక వేధింపులపై సోషల్ మీడియాలో పోస్టుతో వెలుగుచూసింది. దీంతో పత్రాకార్ నగర్ పోలీసులు జ్యోతికుమార్‌పై కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలోని మహారాజా యశ్వంతరావు ఆసుపత్రిలో ఇద్దరు వార్డుబాయ్‌లు కరోనా మహిళా రోగిని లైంగికంగా వేధించారు. కరోనా మహమ్మారి కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు పెరిగాయి.