1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 16 జూన్ 2014 (17:38 IST)

27 మంది యుతులను మోసగించి.. నగ్న ఫోటోలు తీసిన కామాంధుడి అరెస్టు!

తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్ జిల్లాలో ఓ కామాంధుడి రాసలీలలు వెలుగుచూశాయి. ప్రేమ పేరుతో 27 మంది యువతులను మోసం చేయడమేకాకుండా, వారిని శారీరకంగా అనుభవించి, నగ్నంగా వీడియోలు తీసి, వాటిని సీడీలుగా మార్చి విక్రయిస్తూ వచ్చిన ఓ యువకుడిని ఆ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెల్లడైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 
 
దిండిగల్‌‍, మాసిలామణిపురం, శ్రీనగర్‌కు చెందిన బెన్సిఫి అనే 21 యేళ్ళ యువకుడిపై మదురై జిల్లా అనైయూర్ ముడక్కత్తాన్‌ రోడ్డుకు చెందిన చంద్రమోహన్ అనే వ్యక్తి కుమార్తె రెజీనా (24) ఆ జిల్లా పోలీసులకు ఒక ఫిర్యాదు ఇచ్చింది. అందులో... బీకాం పూర్తి చేసిన తాను దిండుగల్ బాలకృష్ణాపురంలో నివశించే తన అక్క ఇంటికి చుట్టపుచూపుగా వచ్చిపోతుండేదాన్ని. అలా వచ్చేపోయే సమయంలో ఒక రోజున బెన్సిఫి తన వెంట అనుసరించేవాడు. ఒక రోజున తన వెనుకనే వచ్చిన బెన్సిఫి.. ఉన్నట్టుండి తన ముందు నిలబడి ప్రేమిస్తున్నట్టు చెపుతూ, చేయిని బ్లేడుతో కోసుకున్నాడు. అంతేకాకుండా, నీవు లేకుంటే నేను జీవించలేనంటూ బోరున విలపించాడు. 
 
దీంతో నా మనస్సు మారి బెన్సిఫిని ప్రేమించసాగాను. ఒక రోజున అతని తల్లిని పరిచయం చేస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లోకి వెళ్లిన వెంటనే మత్తు మందు కలిపిన శీతలపానీయం ఇవ్వగా, దాన్ని సేవించిన వెంటనే తాను అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో నాపై అత్యాచారం చేశాడు. స్పృహలోకి వచ్చిన తాను బెన్సిఫిని నిలదీయడంతో మనమిద్దరం వివాహం చేసుకోబోతున్నామంటూ తనను సమాధానం పరిచాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తన వద్దకు వచ్చి ఇంటికి రావాల్సిందిగా కోరాడు. దానికి తాను రానని చెప్పడంతో మొదటిసారి అత్యాచారం చేసినపుడు తనను నగ్నంగా వీడియో, ఫోటోలు తీసినట్టు, ఇంటికి రాకుంటే వాటిని బహిరంగ పరుస్తానని బెదిరించాడు. 
 
దీంతో నేను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మరో మార్గం లేక గత యేడాది మే నెల 30వ తేదీన తమ పెద్దలకు తెలియకుండా దిండుగల్ పెరుమాళ్ ఆలయంలో తమ స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నట్టు పేర్కొంది. వివాహం చేసుకున్న తర్వాత మూడు నెలలకు వాళ్ల అమ్మ దగ్గరకు తీసుకెళ్లాడు. మేమిద్దరం వివాహం చేసుకున్న విషయం తెల్సిన వెంటనే బెన్సిఫి తల్లి తనను ఇంటి నుంచి బయటకు పంపించాల్సిందిగా ఒత్తిడి చేసింది.  
 
అప్పటి నుంచి తనను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా తాను ఇంటి నుంచి తెచ్చిన 17 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదును కూడా బలవంతంగా తీసుకున్నాడు. ఇంకా నగలు, నగదు తేవాలంటూ వేధిస్తూ వచ్చాడు. అంతేకాకుండా తనను ఇంటినుంచి పంపించేందుకు తన స్నేహితులను ఇంటికి పిలిపించి మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ.. చిత్రహింసలకు గురిచేసేవాడు. ఒక రోజున తమ ఇద్దరి మధ్య ఏర్పడిన ఘర్షణలో తనను క్రికెట్ బ్యాట్‌తో కొట్టడంతో తనకు గర్భస్రావమైంది. దీంతో తాను ఇక్కడ ఉంటే తన ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందనే భయంతో ఇంటికి వెళ్లిపోయాను. తనను మోసం చేయడమే కాకుండా, వరకట్నం వేధింపులకు గురిచేసిన భర్త బెన్సిఫి, ఆయన తల్లి హేమమాలిని, బంధువు రాజా అలియాస్ జ్ఞానరాజాలపై చర్య తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రెజీనా పేర్కొంది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బెన్సిఫి గురించి విచారణ చేపట్టారు. ప్లస్ టూ వరకు మాత్రమే పూర్తి చేసిన బెన్సిఫి... చూసేందుకు ఆకర్షణీయంగా ఉండటంతో అనేక మంది యువతులు తన వలలో వేసుకున్నట్టు తేలింది. తొలుత ప్రేమిస్తున్నట్టుగా యువతులను నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన శీతలపానీయం ఇచ్చి... అత్యాచారం చేయడం, నగ్న ఫోటోలు తీసి, వాటిని స్నేహితులకు చూపించడమే కాకుండా సీడీలుగా మార్చి ఇతర ప్రాంతాలకు విక్రయించినట్టు తేలింది. 
 
మాసిలామణిపురం, శ్రీనగర్‌లోని బెన్సిఫి ఇంటికి కేవలం అతని స్నేహితులు మాత్రమే వచ్చి వెళ్ళేవారని పోలీసులు తెలుసుకున్నారు. ఈయన తల్లి వేరే ప్రాంతంలో ఉంటూ నెలవారి ఖర్చుల కోసం రూ.50 వేలు చొప్పున కుమారుడికి పంపించేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ డబ్బుతో మోటార్ బైకులపై చెక్కర్లు కొడుతూ జల్సాలు చేస్తున్నట్టు తేలింది. బెన్సిఫి ప్రేమ వలలో అనేక మంది కాలేజీ అమ్మాయిలతో పాటు.. పలువురు మహిళలు కూడా చిక్కినట్టు సమాచారం. కొంతమంది అమ్మాయిలైతే.. డబ్బు కోసం బెన్సిఫి ఇంటికి వచ్చి వెళ్తూ, అతని కామదాహానికి బలైనట్టు పోలీసులు గ్రహించారు. ఇలా మొత్తం 27 మందికిపైగా యువతుల జీవితాలను బెన్సిఫి నాశనం చేసినట్టు పోలీసులు చెపుతున్నారు. 
 
దీంతో రెజీనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెన్సిఫితో పాటు.. ఈయన తల్లి హేమమాలిని, బంధువు రాజాలపై కేసులు నమోదు చేశారు. బెన్సిఫిపై మాత్రం 498ఏ, 294బి, 406, 417, 506(1)తో పాటు.. మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, తన బండారం బయటపడటంతో బెన్సిఫి దిండిగల్ నుంచి సేలంకు మకాం మార్చాడు. అయితే, పోలీసులు చాకచక్యంతో సేలంలో ఉన్న బెన్సిఫి ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేశారు.